చందూర్ మండల కేంద్రంలో ఘనంగా జడ కొప్పులాట

NZB: చందూర్ మండల కేంద్రంలోని బోయిగల్లి ఉగాది పండుగను పురస్కరించుకుని ఆదివారం జడుకొప్పులాట ఘనంగా నిర్వహించారు. కళాకారులు అందరూ ఒకచోట చేరి పాటలు పాడుతూ.. కోలాటాలు వేస్తూ జడ కొప్పులాటను ఆడారు. ఈ ఆటను చూడటానికి గ్రామస్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఆటను నిర్వహిస్తున్నామని కళాకారులు తెలియజేశారు.