VIDEO: శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ కార్యాలయం
ప్రకాశం: బేస్తవారిపేటలోని వ్యవసాయ అధికారి కార్యాలయం శిథిలావస్థకు చేరింది. స్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండడంతో సిబ్బంది ప్రాణ భయంతో విధులు నిర్వహిస్తున్నారు. వర్షం పడితే కార్యాలయం అంతా నీటి చెమ్మ ఏర్పడి విధులకు ఆటంకం కలుగుతుందని సిబ్బంది తెలిపారు. అధికారులు స్పందించి, కార్యాలయాన్ని సురక్షిత స్థలానికి మార్చాలని సిబ్బంది కోరుతున్నారు.