అక్రమంగా ఇసుక తరలింపు.. పట్టుపడిన ట్రాక్టర్లు

అక్రమంగా ఇసుక తరలింపు.. పట్టుపడిన ట్రాక్టర్లు

GDWL: అయిజ మండలం పులికల్ శివారులో తుంగభద్ర నది పరివాహక ప్రాంతం నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్ఐ శ్రీనివాసరావు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా ఉంచి వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా  అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.