రేపు గీతాశ్రమంలో ఉసిరిక వనభోజనాలు
MNCL: జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామంలో ఉన్న గీతాశ్రమంలో ఉసిరిక వనభోజనాలను నిర్వహించనున్నామని ఆలయ ప్రధాన గురువు మౌనస్వామి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసం పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం గీతా పారాయణం, గీతా జయంతి పత్రిక నిర్ణయించడం జరుగుతుందన్నారు. అనంతరం సామూహిక ఉసిరిక వనభోజనాలు ఉంటాయని వివరించారు.