మంత్రి నిమ్మలను కలిసిన ఆనం

NLR: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును జిల్లాలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిసారి జిల్లాకు విచ్చేసిన మంత్రి నిమ్మలకు మంత్రి ఆనం పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. మరికాసేపట్లో సోమశిల, కండలేరు జలాశయాల సందర్శనకు మంత్రులు బయలుదేరనున్నారు.