అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
ATP: పెద్దపప్పూరు మండలంలోని ముచ్చు కోటలో అక్రమంగా తరలిస్తున్న ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం పట్టుకున్నట్లు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. బియ్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన, నిలువ ఉంచిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.