ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఎమ్మెల్యే
ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గ పరిధిలో తుఫాన్ సమయంలో అహర్నిశలు ప్రజలకు విశిష్ట సేవలు అందించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించి శనివారం సన్మాన పత్రం అందజేశారు. ఉండవల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల తుఫాన్ విపత్తు సమయంలో అర్థరాత్రి వేళ సైతం బాధితులకు అండగా నిలిచిన తీరును సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు.