ఏయూలో సెమిస్టర్ పరీక్షల పరిశీలన
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను సోమవారం రెక్టార్ ఆచార్య పి.కింగ్ ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రశాంత వాతావరణంలో పటిష్టంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆచార్య జి.రాంబాబు పాల్గొన్నారు.