VIDEO: బేతాళ స్వామిని దర్శించుకోవడానికి బారులు తీరిన భక్తులు
JGL: కొండగట్టు అంజన్న క్షేత్రంలో నిన్న రాత్రి వరకు బేతాళ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. చిన్న జయంతి ఉత్సవంలో భాగంగా భక్తులు ఆంజన్న దర్శనానంతరం ఉప ఆలయాలైన బేతాళ, రామాలయాలను దర్శించుకుంటారు. అయితే మానసిక స్థితి సరిగా లేనివారు ఇక్కడ బేతాళ స్వామికి పూజలు చేయడం వల్ల కోలుకుంటారని భక్తుల నమ్మకం. క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.