పెద్ద ఎక్లరా గ్రామంలో ఘనంగా 'బసవ' జయంతి
KMR: మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం బసవ జయంతి వేడుకలు నిర్వహించారు. రచన మందిరం నుంచి బస్టాండ్ వరకు మహిళలు మంగళ హారతులు, భజనలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 'కాయకవే కైలాస' అనే బసవన్న సందేశం అందరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు.