ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

W.G: వాతావరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీని కారణంగా రాష్ట్రానికి మరో 3 రోజులు భారీ వర్షసూచన ఉన్నట్టు ప్రకటించిందన్నారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఆమె హెచ్చరించారు.