హోం వర్క్ చేయలేదని విద్యార్థులను చితకబాదిన HOD
SRD: హత్నూర మండలం రత్నపురి ఇనిస్టిట్యూట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదన్న కారణంతో 15 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను HOD శివారెడ్డి విచక్షణారహితంగా చితకబాదారు. ఈ దాడిలో విద్యార్థుల కాళ్లకు వాతలు రావడంతో విద్యార్థుల తల్లాదండ్రులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. HOD శివారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.