జైలుకు టీడీపీ ఎమ్మెల్యే.. ఎమోషనల్ కామెంట్స్

KRNL: మహిళా సబ్ జైల్‌ను ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ సందర్శించారు. ఈ మేరకు భూమా ట్రస్ట్ తరుపున అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేశారు. “వైసీపీ పాలనలో నాపై తప్పుడు కేసుతో ఇదే జైలులో పెట్టారు. నా భర్త, బిడ్డకు చాలా రోజులు దూరంగా జైలు గోడల మధ్య గడిపాను. వాటన్నింటినీ ఎప్పటికీ మర్చిపోను” అని అవేదన వ్యక్తం చేశారు.