తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన వైసీపీ నేతలు

కోనసీమ: ఆదివారం కురిసిన అకాల భారీ వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని ఉప్పలగుప్తం మండలం బట్టుపాలెంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, అసెంబ్లీ ఇంఛార్జి పినిపే శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.