డోంగ్లీ మార్కెట్లో సోయాబిన్ ధర ఎంతంటే?
KMR: డోంగ్లీ, మద్నూర్ మార్కెట్‌లో సోయాబిన్ ధర క్వింటా రూ.4,450 పలుకుతోందని అడత్ వ్యాపారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా సోయాబిన్ పంటలో మట్టి శాతం ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 2 శాతం మాత్రమే మట్టి ఉండాలనే నిబంధన ఉండటంతో కేంద్రంలో అమ్మిన సంచులు గోదాం నుంచి తిరిగి వస్తున్నాయి. దీంతో రైతులు ప్రైవేటులో విక్రయాలు చేస్తున్నారు.