అడవికి నిప్పు పర్యావరణానికి ముప్పు శీర్షికతో గోడపత్రాన్ని విడుదల

ప్రకాశం: గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ నిషా కుమారి అడవికి నిప్పు పర్యావరానికి ముప్పు అనే శీర్షికతో అడవులపై అవగాహన కల్పించే గోడపత్రాన్ని విడుదల చేశారు. ఎండాకాలం సమీపిస్తున్న సమయంలో అడవులలో ఎండు గడ్డి రాలుతుందని పొరపాటున కూడా నిప్పు పెట్టరాదు అన్నారు. అడవికి నిప్పు పెడితే గ్రామాల వరకు వ్యాపించి పర్యావరణానికి మానవులకు ముప్పు కలుగుతుంది.