తులం బంగారం పథకం ఎక్కడికి పోయింది: ఎమ్మెల్యే
ASF: జైనూర్ మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో 14 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంగళవారం MLA కోవ లక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డ పెళ్ళికి ఇస్తానన్న తులం బంగారం పథకం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు అని చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.