భారీ వర్షానికి నేలకొరిగిన వరి పంట

KNR: సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన రైతు బాగోతం వీరయ్య ముందస్తుగా సన్నరకాన్ని 20 గుంటల భూమిలో సాగు చేశారు. కాగా, సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొతకొచ్చిన వరి చేను పూర్తిగా నేలకొరిగింది. దీంతో చేతికందే సమయంలో వరి చేను నెలమట్టం కావడంతో రైతు వీరయ్య బోరున విలపిస్తున్నాడు. వరికోత మిషన్లు దొరకకపోవటంతో నష్టం వాటిల్లిందని వాపోయాడు.