ఉద్ధృతంగా చారాల చెరువు మొరవ
CTR: గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చౌడేపల్లి మండలంలోని చెరువుల మొరవలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చారాల పెద్ద చెరువు వద్ద మరువ ఉద్ధృతి కారణంగా గ్రామాలకు వెళ్లే రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీటి ధాటికి సుమారు 100 ఎకరాలకు పైగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.