రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
CTR: రొంపిచర్ల వద్ద తిరుపతి-మదనపల్లె హైవేపై నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయలయ్యాయి. రొంపిచర్లకు చెందిన లతీఫ్ పీలేరులో మేస్త్రీ పని ముగించుకుని బైక్‌పై వస్తుండగా దారిలో మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కాగా, వాహనదారులు 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.