పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే
BDK: మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ సర్వే పనుల కోసం జిల్లా అధికార యంత్రాంగం ఇవాళ తెల్లవారుజామునే గార్లలో పోలీసులను రంగంలో దింపి, యుద్ధ వాతావరణం కల్పించడాన్ని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన అఖిలపక్ష నాయకులను తక్షణమే విడుదల చేయాలని, స్థానికుల కోరిక మేరకు లింక్ కెనాల్ సర్వే పనులను వెంటనే ఆపాలన్నారు.