ప్రభుత్వ నిబంధనలకు తూట్లు
NLR: కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టి రాత్రి 6 గంటల తర్వాత ఇసుక రవాణాను నిలిపివేసింది. అయితేౌ ఈ నిబంధనలను ఎవరూ పాటించకుండా రాత్రింబవళ్లు ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారు. రహదారులపై వేగంగా వెళ్లే ట్రాక్టర్ల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.