అగ్నిప్రమాద బాధితులకు రూ.10.5 కోట్ల నష్టపరిహారం

అగ్నిప్రమాద బాధితులకు రూ.10.5 కోట్ల నష్టపరిహారం

ఎన్టీఆర్: జగ్గయ్యపేట సాయి తిరుమల కోల్డ్‌స్టోరేజ్‌‌లో ఏడు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో పంటలు నష్టపోయిన 207 మంది రైతులకు న్యాయం జరిగింది. కోల్డ్‌స్టోరేజ్ యాజమాన్యం నుంచి మొత్తం రూ. 10.5 కోట్లు నష్టపరిహారంగా సోమవారం రైతులకు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య చేతుల మీదుగా అందించారు. ఈ చెల్లింపులతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.