'రెహానా ఆత్మహత్య కేసులో నిందితుడిని అరెస్టు చేయాలి'
కడపలో రెహానా ఆత్మహత్య ఘటనపై ఏపీ మహిళా సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు షాజహాన్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. మహిళలు ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని, అన్యాయం జరిగితే న్యాయం కోసం ముందుకు రావాలని సూచించింది.