'కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యువతదే'

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతే రాబోయే భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.