రీ అసెస్మెంట్ త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
VZM: NTR భరోసా వికలాంగ పింఛన్ల రీ అసెస్మెంట్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిలో జాప్యం జరుగుతుండటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరం రీ అసెస్మెంట్ పై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 2068 మందికి రీ అసెస్మెంట్ చేయాల్సి ఉందన్నారు.