విజయనగరం జిల్లాలో రోడ్డుపై లారీ దగ్ధం

AP: విజయనగరం జిల్లాలోని నాతవలస టోల్ గేట్ సమీపంలో రోడ్డుపై లారీ దగ్ధమైంది. తారు డబ్బాల లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో లారీలోని తారు డబ్బాలు భారీ శబ్దాలతో పేలడంతో సమీపంలోని వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దీంతో రహదారిపై కొంత సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.