కుందాలపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత

కుందాలపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత

కోనసీమ: పి.గన్నవరం మండలం కుందాలపల్లిలో సోమవారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మృతదేహాన్ని అంతిమయాత్రకు తీసుకు వెళ్లే క్రమంలో ఒక ఇంటి వద్ద పెళ్లి పందిరి ఉండటంతో వేరే దారిలో తీసుకు వెళ్లమని స్థానికులు సూచించారు. అయితే అంతిమయాత్ర పెళ్లిపందిరి ఉన్న రహదారి గుండానే తీసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. తర్వాత గొడవ సద్దుమణిగింది.