అద్వాన్నంగా తయారైన మధిర పట్టణం వీధి రోడ్లు

అద్వాన్నంగా తయారైన మధిర పట్టణం వీధి రోడ్లు

KMM: మధిర పట్టణంలోని 21వ వార్డు వీధి రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని స్థానికులు తెలిపారు. వర్షపు నీరు రోడ్డుపైకి చేరి బురదమయంగా కావడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంపై పలుమార్లు మున్సిపాలిటీ అధికారులకు చెప్పిన ఎలాంటి చర్యలు లేవన్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి బురదమయంగా ఉన్న రహదారికి మరమ్మతులు చేయాలని కోరారు.