VIDEO: వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన PACS ఛైర్మన్
NZB: ఎడపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయింది. జాన్కంపేట్‌లోని కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం ఛైర్మన్ మిద్ది నరేందర్ సోమవారం పరిశీలించారు. ఎండిన ధాన్యాన్ని రైస్ మిల్‌కు పంపే విధంగానే, తడిసిన ధాన్యాన్ని బైల్డ్ రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు.