నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

SKLM: ఆమదాలవలసలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణస్వీకారం గురువారం జరిగింది. అధ్యక్షురాలిగా కణితి విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడిగా జి. వెంకట్రావు, కార్యదర్శిగా విజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా గణపతిరావు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.