పోలీసుల అదుపులో హత్య కేసు నిందితుడు

పోలీసుల అదుపులో హత్య కేసు నిందితుడు

CTR: పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లి బీసీ కాలనీలో సోమవారం బంగారు నగల కోసం దుండగుడు విమల అనే మహిళను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం వృద్ధురాలు కళావతమ్మ తెలిపిన వివరాల మేరకు డాగ్ స్కాడ్ ఆధారంగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.