బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ విజయ సునీతను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీలలో ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయని వివరించారు. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.