వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

JGL: వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ అడ్డూరి రాములు తెలిపారు. శుక్రవారం మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పట్టణ, మండలంలో ఏర్పాటు చేయనున్న వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.