నేడు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష
ప్రకాశం: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి ప్రవేశ పరీక్షను ఇవాళ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. జిల్లాలో మొత్తం 25 కేంద్రాల్లో 5502 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష సమయమని, పరీక్షకు గంట ముందే కేంద్రానికి రావాలని సూచించారు.