విశాఖ రంగుల‌మ‌యం

విశాఖ రంగుల‌మ‌యం

VSP: విశాఖపట్నం సాగరతీరం మంగళవారం రంగుల హరివిల్లుగా మారింది. హోలీ పండుగను పురస్కరించుకుని నగరవాసులు ఉత్సాహంగా రంగుల కేళిలో మునిగిపోయారు. ఉదయం నుంచే ప్రధాన వీధులు, అపార్ట్‌మెంట్‌లు, బీచ్ రోడ్డు ప్రాంతాలు యువత కేరింతలతో సందడిగా మారాయి.నగరంలోని పలు రిసార్టులు, హోటళ్లలో నిర్వహించిన రెయిన్ డాన్స్, డీజే కార్యక్రమాలు సందడికి మరింత ఊపునిచ్చాయి.