ఈనెల 12న ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు
PLD: మండల కేంద్రమైన ఈపూరు ఏపీ మోడల్ స్కూల్లో ఏప్రిల్ 12వ తేదీన 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మజ ఓ ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందన్నారు.