ఆందోళనలో పొగాకు అన్నదాతలు

ఆందోళనలో పొగాకు అన్నదాతలు

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రంలో ధరలు రోజురోజుకు దిగజారుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో పొగాకు కేజీ ధర రూ.280 పలకగా ప్రస్తుతం రూ.230లు మాత్రమే ఉంది. గత ఏడాది కేజీ రూ. 300 ఉంటే ఈ ఏడాది ధర దిగజారింది. గత ఏడాది కన్నా ఖర్చులు ఈ ఏడాది అధికమయ్యాయి. ధరలు చూసి రైతులు బెంబేలెత్తుతున్నారు.