నేడు నగరానికి రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్

నేడు నగరానికి రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్

NZB: రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ నేడు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10.00 గంటలకు జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటల వరకు మైనారిటీ వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు. ఎవరైనా అర్జీలు సమర్పించే వారూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.