సివిల్స్ ఎగ్జామ్‌కు ఫ్రీ ట్రైనింగ్
CTR: యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా అన్నారు. సివిల్స్ ప్రిలిమనరీ, మెయిన్స్ పరీక్షలకు జిల్లాలో అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.