'అంబులెన్స్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి'

SRD: ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ప్రైవేట్ డ్రైవర్స్ అంబులెన్స్ అడ్డ వద్ద సీఐటీయూ జెండాను మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. అతి తక్కువ వేతనాలకు డ్రైవర్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు, సహాయ కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.