ముగ్గురు సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

ముగ్గురు సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

VZM: రామభద్రపురం సచివాలయాన్ని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టి, సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న పలు సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తనిఖీ సమయంలో కొంతమంది సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరు కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.