ఉంగుటూరులో డ్రైనేజీలు లేక ఇబ్బందులు

ఉంగుటూరులో డ్రైనేజీలు లేక ఇబ్బందులు

కృష్ణా: ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలోని జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 450 ప్లాట్లలో 300 ఇళ్లు నిర్మాణం పూర్తి అయినా, ఎనిమిది అడ్డరోడ్లు, ఏడు నిలువు రోడ్లలో ఎక్కడా పనులు జరగలేదని తెలిపారు. వర్షం పడితే బురదలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు.