వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్‌గా సమ్మయ్య

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా ఎస్. సమ్మయ్య సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇంఛార్జ్ కమిషనర్ గా పనిచేసిన సుధీర్ బాబుకు హైదరాబాద్ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి రావడంతో ఆయన బదిలీపై వెళ్ళిపోయారు. దీంతో వరంగల్ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న సమ్మయ్యకు అదనంగా ఈ బాధ్యతలను అప్పగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.