కొట్టాల చెరువు గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్
NDL: ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెరువు గ్రామంలో ఇవాళ జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కలిసి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి , బుడ్డా రాజశేఖర్ రెడ్డికి గ్రామ ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రాన్ని అందజేశారు.