ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
NGKL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా MLA డాక్టర్ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.