'Arattai'లో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్

'Arattai'లో ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్

దేశీయ టెక్ దిగ్గజం జోహో తమ మెసేజింగ్ యాప్ అరట్టైలో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. దీనిలో 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్'ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్‌తో ఇకపై సందేశాలను పంపినవారు, స్వీకరించినవారు మాత్రమే వాటిని చదవగలరు. జోహో సంస్థతో సహా మరెవరూ దాన్ని చూడటం కుదరదు. ఇందుకోసం యూజర్లు తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలని సంస్థ సూచించింది.