మొన్నటిదాకా గ్రూప్- 4 కొలువు.. నేడు గ్రూప్- 2

మొన్నటిదాకా గ్రూప్- 4 కొలువు.. నేడు గ్రూప్- 2

KNR: ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కాంతల సాయి ప్రశాంత్ రెడ్డి గ్రూప్- 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్‌గా కొలువు సాధించారు. ప్రశాంత్ ఇంటర్ వరకు హైదరాబాదులో చదివారు. నాగపూర్‌లో బీటెక్ పూర్తి చేసి, 2023లో గ్రూప్ - 4 ఉద్యోగం సాధించి రంగారెడ్డి జిల్లాలోని వైద్యాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. తాజాగా గ్రూప్-2 ఫలితాల్లో మెరిశారు.