విద్యుత్ సరఫరాకు అంతరాయం
W.G: భీమవరం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. లోసరిలో కొత్త ఉపకేంద్రం పనుల దృష్ట్యా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదని వెల్లడించారు. లోసరి, దెయ్యాలతిప్ప, తోకతిప్ప, నాగేంద్రపురం గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.