నగరంపల్లిలో గ్రీన్ కార్ప్స్ కార్యక్రమం

SKLM: వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి ప్రభుత్వ ZP హై స్కూల్‌కు విద్యార్థులు గురువారం వరినాట్లు వేసే పొలంలోకి వెళ్లారు. HM టి. రామారావు ఆధ్వర్యంలో గ్రీన్ కార్ప్స్ కార్యక్రమం నిర్వహించారు. అక్కడి రైతులతో మాట్లాడి నేల చదును చేయడం, దమ్ము పట్టడం, వరినాట్లు వేయడం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.